నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి
భారతదేశంలో సొంత థియేటర్‌, ఖరీదైన కారు లేని పెద్ద సంగీత దర్శకుడ్ని నేనే అని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కరీవాణి. బాహుబలి 2 ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో కీరవాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నన్ను చూసిన చాలా మంది కీరవాణిది కడుపు నిండిన బేరం అనుకుంటారు. కానీ నేనేం పెద్దగా సంపాదించలేదు. నా భార్యా బిడ్డల్ని క్షేమంగా చూసుకొనేంత మాత్రమే సంపాదించా అని కీరవాణి చెప్పుకొచ్చారు.

నా కడుపు నిండలేదు..
కడుపు అంటే ఇక్కడ తిండి కాదు. ఆత్మ సంతృప్తి. నేను చేయగలిగే పని వేరు. చేస్తోంది వేరు. నేను ఎంత సంపాదిస్తే అంతలోనే బతికా. ‘మగధీర' తరవాత కూడా ఖరీదైన కారు కొనలేకపోయా అని కీరవాణి చెప్పుకొచ్చారు.

పారితోషికం నచ్చకపోతే పనిచేయను..
కొందరు గాయనీ గాకులకు పారితోషికాలు చాలా తక్కువ ఇస్తున్నారనే విమర్శలపై దానిపై కీరవాణి స్పందిస్తూ... ఎంత ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే తక్కువ అనేదానికి కొలమానం లేదు. ఓ గాయకుడికి పారితోషికం నచ్చలేదంటే మరోసారి పిలిచినప్పుడు రాడు. వచ్చాడంటే తనకొస్తున్న పారితోషికం విషయంలో సంతోషంగా ఉన్నాడన్నమాటే. నా వరకూ నేను పారితోషికం నచ్చకపోతే పని చేయను. గాయనీ గాయకులు కూడా ఇలానే ఉండాలి అని కీరవాణి అన్నారు.

దర్శకులను తిట్టే గీత రచయితల కొరత ఉంది..
వేటూరి, సిరివెన్నెల లాంటి గీత రచయితలకు ఒక్క పాట రాసినా, పాటలన్నీ వాళ్లే రాసినా కథ చెప్పి తీరాల్సిందే. ‘ఇదేం కథ..' అని తిట్టిన సందర్భాలు నాకు తెలుసు. గీత రచయిత పని పాట రాయడం మాత్రమే కాదు. కొన్ని కొన్నిసార్లు దర్శకుడికి దిశా నిర్దేశం చేయాలి. అలాంటి రచయితలు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకూ జొన్నవిత్తుల గారిది ఇదే పద్ధతి. ఆయన మహా పండితుడు. సన్నివేశం నచ్చకపోతే తిట్టరు గానీ, అక్కడ్నుంచి లేచి వెళ్లిపోతారు. నాతో సహా మిగిలిన వాళ్లంతా నాలుగు డబ్బుల కోసం పని చేస్తాం. మేమెక్కడ తిడతాం? నోరు మూసుకొని పని చేయాలి. ఏదైనా అందామంటే ఉద్యోగం పోతుంది. వేటూరి, సిరి వెన్నెల ఏనాడూ రాజీ పడలేదు. కాబట్టే.. ఆమధ్య ట్విట్టర్‌లో ‘వాళ్ల తరవాత ఇంకెవరూ లేరు' అని అన్నాను. అని కీరవాణి చెప్పుకొచ్చారు.
  Advertisement
 
Latest News
నేడు ‘నాని’ పుట్టినరోజు - khammamtv.com
----------------------------------------------------------------------------------------------------
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు
----------------------------------------------------------------------------------------------------
నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి
----------------------------------------------------------------------------------------------------
శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు (‘మిస్టర్’ రివ్యూ)
----------------------------------------------------------------------------------------------------
స్పైడర్ స్పెల్లింగ్ spider (అర్దం సాలెపురుగు)
----------------------------------------------------------------------------------------------------
ఒకే ఒక మాట... ‘గురు’ సమీక్ష
----------------------------------------------------------------------------------------------------
కుమార్తె తొలి ఫొటోను షేర్‌ చేసిన హీరో 
----------------------------------------------------------------------------------------------------
రజితోత్సవం
----------------------------------------------------------------------------------------------------
ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?
----------------------------------------------------------------------------------------------------
గణ తంత్రం
----------------------------------------------------------------------------------------------------
More..