ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా(70) ఇకలేరు. 70 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధ పడుతూ ఆయన కన్ను మూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. 1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం బాలీవుడ్‌లో అప్రతిహతంగా కొనసాగింది. 2015 వరకు దాదాపు 140 చిత్రాల్లో ఆయన నటించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’ (1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా ‘దిల్‌వాలే’ చిత్రంలో కన్పించారు.
విలన్‌ నుంచి హీరోగా..
వినోద్‌ ఖన్నా 1946 అక్టోబర్‌ 6న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆ తర్వాత కొంతకాలానికే భారత్‌, పాకిస్థాన్‌లు విడి పోవడంతో ఖన్నా కుటుంబం ముంబయికి వచ్చేసింది. సినిమాల మీద ఆసక్తితో 1968లో సునిల్‌ దత్‌ ‘మన్‌ కా మీట్‌’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన సినీ ప్రస్థానం విలన్‌ నుంచి హీరోగా కొనసాగింది. ‘మన్‌ కా మీట్‌’ చిత్రంలో విలన్‌గా నటించిన వినోద్‌ ఖన్నా.. ఆ తర్వాత ‘పురబ్‌ అవుర్‌ పాశిమ్‌’, ‘ఆన్‌ మిలో సజ్నా’, ‘మస్తానా’, ‘మేరా గావ్‌ మేరా దేశ్‌’, ‘ఎలాన్‌’ లాంటి చిత్రాల్లో విలన్‌గా నటించారు.
ఆ తర్వాత 1971లో విడుదలైన ‘హమ్‌ తుమ్‌ అవుర్‌ వహ్‌’ సినిమాతో హీరోగా మారారు. అలా.. ‘ఫెరాబీ’, ‘హత్యారా’, ‘ఖుర్బానీ’, ‘గద్దర్‌’ లాంటి సినిమాల్లో హీరోగా మెప్పించారు. 1987 నుంచి 1995 మధ్య నటించిన సినిమాల్లో వినోద్‌ ఖన్నా తన తోటి కథానాయకులైన రిషి కపూర్‌, గోవిందా, సంజయ్‌ దత్‌, రజనీకాంత్‌ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. కాగా, తారస్థాయిలో ఉన్న సయమంలో వినోద్‌ఖన్నా ఒక్కసారిగా సినీరంగానికి దూరమయ్యారు. ఆధ్యాత్మికత కోసం 1982లో సినీ జీవితాన్ని వదిలేశారు. దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. 1987లో ఇన్సాఫ్‌ సినిమాతో మళ్లీ సినీరంగ ప్రవేశం చేశారు.
141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా..
ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌ మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. ఇటీవల షారూఖ్‌ఖాన్‌ నటించిన దిల్‌వాలే చిత్రంలో చివరి సారిగా తెరపై కన్పించారు.
1971లో వినోద్‌ఖన్నాకు గీతాంజలితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు రాహుల్‌ ఖన్నా, అక్షయ్‌ ఖన్నా. ఆ తర్వాత గీతాంజలి నుంచి విడిపోయిన ఖన్నా.. 1990లో కవితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా వినోద్‌ ఖన్నా రాణించారు. ప్రస్తుతం గుర్‌దాస్‌పూర్‌ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
క్యాన్సర్‌ కారణంగా..
విభిన్న పాత్రలతో ఆకట్టుకుని అభిమానులను సొంతం చేసుకున్న వినోద్‌ ఖన్నా ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న డీహైడ్రేషన్‌ కారణంగా ఖన్నా ముంబయిలోని ఆసుపత్రిలో చేరారు. దీన స్థితిలో కుటుంబంతో ఉన్న వినోద్‌ ఖన్నా ఫొటో ఒకటి ఆ సమయంలో మీడియాలో వైరల్‌గా మారింది.
  Advertisement
 
Latest News
నేడు ‘నాని’ పుట్టినరోజు - khammamtv.com
----------------------------------------------------------------------------------------------------
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు
----------------------------------------------------------------------------------------------------
నా కడుపు నిండలేదు, ఖరీదైన కారు కూడా లేదు: కీరవాణి
----------------------------------------------------------------------------------------------------
శ్రీను వైట్ల తన ఎలిజీ తనే రాసేసుకున్నాడు (‘మిస్టర్’ రివ్యూ)
----------------------------------------------------------------------------------------------------
స్పైడర్ స్పెల్లింగ్ spider (అర్దం సాలెపురుగు)
----------------------------------------------------------------------------------------------------
ఒకే ఒక మాట... ‘గురు’ సమీక్ష
----------------------------------------------------------------------------------------------------
కుమార్తె తొలి ఫొటోను షేర్‌ చేసిన హీరో 
----------------------------------------------------------------------------------------------------
రజితోత్సవం
----------------------------------------------------------------------------------------------------
ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?
----------------------------------------------------------------------------------------------------
గణ తంత్రం
----------------------------------------------------------------------------------------------------
More..