చంద్రుగొండ సమీపంలో RTC బస్సును ఢీ కొట్టిన ట్రిప్పర్.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు - khammamtv.com
లాల్ జాన్ పాషా, యాకూబ్ పాషా, చంద్రుగొండ, మణుగూరు రిపోర్టర్లు, ‘ఖమ్మం టీవీ’
----------------------------------------------------------
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న రహదారి ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్తితి విషమంగా ఉంది. RTC బస్సును టిప్పర్ వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కొత్తగూడెంలోని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా కనిగిరి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్లు... VM.క్రిష్ణ, శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మణుగూరు డిపో కు చెందిన బస్సు (నెం. . APO 20Z 0128) మణుగూరు నుంచి తెల్లవారు జామున 4.30 గంటలకు 27 మంది ప్రయాణికులతో బయలు దేరింది. పాల్వంచలో మరికొందరు ఎక్కారు. కొత్తగూడెం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలంలోకి ప్రవేశించిన బస్సు మద్దుకూరు దాటి రెండు కిలో మీటర్లు వెళ్లింది. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి వేగంగా బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు ఎడమ పక్కకూ, బస్సును ఢీకొట్టిన టిప్పర కుడి పక్కకు వేగంగా దొర్లుకుంటు పడిపోయాయి. ప్రమాదంలో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న పాల్వంచ కు చెందిన వృద్దురాలికి తీవ్ర గాయాలు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్ డ్రైవర్, క్లీనర్ ఇరువురు బలమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలొదిలారు. బస్సులోని 27 మంది ప్రయాణికుల్లో 12 మందికి తీవ్ర గాయాలు, మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను కొత్తగూడెం తరలించారు. పాల్వంచ లో
ఎక్కిన ముగ్గురు ప్రయాణీకులు తల్లీ కొడుకూ, కోడలు కాగా తల్లీ చనిపోయింది. మణుగూరులో బస్సు ఎక్కన ప్రయాణీలకులంతా క్షేమంగా బయట పడ్డారు.
.....................................................................................
మృత్యు శకటం
ఆర్టీసీ బస్సు, బొగ్గు లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం
19 మందికి గాయాలుముగ్గురి పరిస్థితి విషమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా 19 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం, హైదరాబాద్‌ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మణుగూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కనిగిరి వెళ్తుండగా సత్తుపల్లి నుంచి వస్తున్న బొగ్గు లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జుయ్యింది. లారీ కూడా రెండు భాగాలుగా విడిపోయింది. బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు డ్రైవర్‌, కండక్టర్‌ ఉన్నారు. వీరిలో పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన షంషున్నిసా (65) డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చొని ఉండగా అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ వెంకటరెడ్డి (48) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటరెడ్డి లారీ కింద మట్టిలో కూరుకుపోవడంతో సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. పెనుబల్లి మండలం మండాలపాడుకి చెందిన తడికమళ్ల వెంకటేశ్వర్లు(లారీ డ్రైవర్‌)కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఖమ్మం తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మణుగూరుకు చెందిన మీరాబాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను హైదరాబాద్‌ తరలించారు. మణుగూరుకు చెందిన తిరుపతిరావు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అతన్ని ఖమ్మం తరలించారు. మణుగూరుకు చెందిన షంషుద్దీన్‌, అబ్దుల్‌ మజీద్‌, మీరాబీ, బస్సుడ్రైవర్‌ ధరావత్‌ శ్రీనివాస్‌, పాల్వంచకు చెందిన ఆసియా బేగం, మస్తాన్‌ అహ్మద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్లో తిరుపతమ్మ కాలుకు, మల్లమ్మ తలకు, పద్మ, పుష్పావతి, లక్ష్మీ, జితేంద్రకుమార్‌, రాంబాబు, రాఘవరావు, సరిత, కృషేన్‌లకు తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. జూలూరుపాడు సీఐ సంపత్‌కుమార్‌, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎస్‌ఐలు కడారి ప్రసాద్‌, రాజేశ్‌ ఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రుగొండ 108 వాహనం పనిచేయకపోవడంతో పక్క మండలాల నుంచి అంబులెన్సులు వచ్చి క్షతగాత్రులను తీసుకెళ్లాయి.
మూడు గంటలైనా వైద్యానికి నోచుకోని దైన్యం
ఆర్టీసీ బస్సులో గాయపడ్డ క్షతగాత్రులను ఆదివారం ఉదయం చంద్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యాధికారి లేకపోవడంతో మూడు గంటలపాటు క్షతగాత్రులు ఆర్తనాదాలు చేశారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో సత్వరమే సేవలు అందకుండా పోయాయి. కేవలం ఒక స్టాఫ్‌ నర్స్‌ మాత్రమే ఉండటంతో అందరికీ ప్రాథమిక చికిత్స చేయడం కష్టమైంది. ప్రభుత్వం ఒకపక్క ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మెరుగు పరుస్తున్నా ఇలాంటి సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానికులు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వైద్యాధికారి స్థానికంగా ఉండకపోవడంతో పేదలకు మెరుగైన వైద్యం అందకుండా పోతుందని స్థానికులు అంటున్నారు. తీవ్రంగా గాయపడ్డ లారీడ్రైవర్‌ తడికమళ్ల వెంకటేశ్వర్లు, సరిత, తిరుపతిరావు మూడు గంటలపాటు ఆర్తనాదాలు చేశారు. ఒకపక్కన రక్తస్రావం అవుతుండగా వైద్యం అందక క్షతగాత్రులు ఇబ్బందిపడ్డారు. డీఎంఅండ్‌హెచ్‌వో దయానందస్వామికి కూడా చరవాణిలో ఫిర్యాదు చేశారు. మూడు గంటలైనా వైద్యాధికారి లేరని వైద్యం ఎవరు అందిస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు. మద్దుకూరు సమీపంలో జరిగిన సంఘటనలో ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు జూలురుపాడు సీఐ సంపత్‌కుమార్‌ చెప్పారు.
అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే.
  Advertisement
 
Latest News
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
..................................................................... డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కో ..
----------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
లాక్ డౌన్ ను ప్రజ లు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.ఈ రెండు వారాలు చాలా ముఖ్యమైన రోజులు,ప్రజ ..
----------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
............................................................................................... కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ దేశ ..
----------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................................... ఖమ్మం శివార ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................................... ప్రముఖ రియ ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com
............................................................................................ బంగారం వ్యాపార రంగంలో మా (మీ) " శ్రీ వెంకట్రామా జ్యూయలర్ ..

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
(చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ) ................................................... ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
----------------------------------------------------------------------------------------------------
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. ప్రియాంక రెడ్డీ, మా ..
----------------------------------------------------------------------------------------------------
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీకి బసవ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఎంపిక - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ ..
----------------------------------------------------------------------------------------------------
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
................................................................. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వి ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన గాంథీ సంకల్ప య ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. ఖమ్మం నగరంలోని శ్రీర ..
----------------------------------------------------------------------------------------------------
RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
................................................................... దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
ఈటల రాజేందర్ కు ముదిరాజుల ఘన స్వాగతం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................... తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత ..
----------------------------------------------------------------------------------------------------
సంఘ విద్రోహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - CP తప్సీర్ - khammamtv.com
కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------------------- సంఘ విద్రోహ, నేర రహిత, ప్రశాంత గ్రామ ..
----------------------------------------------------------------------------------------------------
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - khammamtv.com
................................................................ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగా ఖమ్మం శాసన సభ్యులు (MLA) పువ్వ ..
----------------------------------------------------------------------------------------------------
‘జాన్ సార్’ ఇక లేరు - khammamtv.com
డోర్నకల్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో సెప్టెంబర్ 5న స్సర్శ హాస్పిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త... ఆత్మీయ స్పర్శ.. ఖమ్మం వైరా రోడ్డు LIC పాత ఆఫీస్ సమీపంల ..
----------------------------------------------------------------------------------------------------
ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ అవార్డు! - khammamtv.com
..................................................... ద వైర్ జర్నలిస్టుకు అంతర్జాతీయ పురస్కారం ! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నల ..
----------------------------------------------------------------------------------------------------
మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే... khammamtv.com
.............................................. చూడండి... మాటలకంటే బీప్ లెక్కువున్న సినిమా చూడాలనుకుంటే తప్పక చూడండి... జ ..
----------------------------------------------------------------------------------------------------
29 మంది బాలబాలికలను కాపాడిన రైల్వే పోలీసులు - khammamtv.com
లోకేష్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుల ..
----------------------------------------------------------------------------------------------------
నిరుపేద విద్యార్థుల కోసం లక్ష రూపాయల విరాళం - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ...................................... నిరుపేద విద్యార్థుల చదువుల కోసం బత్తినేని ..
----------------------------------------------------------------------------------------------------
18 నుంచి పోలీస్ సిబ్బంది బదిలీలు - khammamtv.com
......................................................... ఖమ్మం ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది బదిలీ పక్రియలో భాగంగా అదనపు DCP ( ..
----------------------------------------------------------------------------------------------------
పోడు సమస్యపై కారేపల్లిలో BJP OBC మోర్చా ఆందోళన - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------------------------ పోడు భూములకు పట్టాలివ్వ ..
----------------------------------------------------------------------------------------------------
అక్షయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో రాత పుస్తకాల పంపిణీ - khammamtv.com
తిరుమలాయపాలెం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... కంటి ఆసుపత్రి సేవలూ, వ ..
----------------------------------------------------------------------------------------------------
సింగరేణి మండల పరిషత్ సమావేశంలో రచ్చ రచ్చ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల ..
----------------------------------------------------------------------------------------------------
రహదారి ప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు - khammamtv.com
కోదాడ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................... రహదారి ప్రమాదంలో జబర్దస్త్ చంట ..
----------------------------------------------------------------------------------------------------
More..