సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల నుంచి విముక్తి చేయడానికి పెరియార్‌ EV రామస్వామి ఉద్యమించిన తీరూ, చేపట్టిన సిద్ధాంతం విలక్షణమైంది. తమిళనాడు ఈరోడ్‌ పట్టణంలో 1879 సెప్టెంబరు 17న పెరియార్‌ రామస్వామి జన్మించారు. ఆయన్నే నేడు దేశమంతటా పెరియార్‌ అంటూ పిలుస్తున్నారు. పెరియార్‌ అంటే దేశాభిమాని. ఆయన 1973 డిసెంబరు 24న మరణించారు. జీవితమంతా దళితులూ, బలహీనవర్గాల అభ్యుదయం కోసం, వారి సామాజిక విమోచన కోసం శ్రమించారు. అస్పృశ్యత నిర్మూలన కోసం అనేక పోరాటాలు చేశారు. 1950లో రాజ్యాంగం పార్లమెంటులో ఆమోదం పొంది అమలులోకి వచ్చింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన పెరియార్‌ తమిళనాడు అంతటా పర్యటించి తీర్పు మూలంగా పీడిత కులాలకు ఏర్పడుతున్న నష్టాన్ని తెలియజేశారు. వారందరినీ సమీకమికరించి ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ప్రతిని పెరియార్‌ దహనం చేశారు. రాష్ట్రమంతా ఆందోళనలు చెలరేగాయి. చివరకు పెరియార్‌ను నెహ్రూ ప్రభుత్వం అరెస్టు చేసింది. తరువాత వాస్తవాన్ని గ్రహించిన అప్పటి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్‌ పరిరక్షణకు అంగీకరిచారు. రాజ్యాంగ నిర్మాతా, న్యాయ శాఖా మంత్రి అంబేద్కర్‌తో చర్చించి సాంఘికంగా, విద్యాపరంగా ఎలాంటి వెనుకబడిన కులాలు లేదా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి ప్రత్యేక సదుపాయం రాజ్యం కల్పించవచ్చని రాజ్యాంగంలోని అధికరణ 15కు సబ్‌క్లాజ్‌ 4ను కొత్తగా చేర్చారు. మహిళల స్వేచ్ఛ పట్ల పెరియార్‌ అభిప్రాయాలు విప్లవాత్మకమైనవి. ఆయన స్త్రీ పురుషుల మధ్య ప్రేమా, పెళ్లి పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పురుషులే కాదు, స్త్రీలు కూడా ఆశ్చర్యపోయారు. 1928లోనే ఆయన ఒక సభలో మాట్లాడుతూ.. మనం స్వేచ్ఛగా ఉండాలంటే మన స్త్రీలకు స్వేచ్ఛనివ్వాలని చెప్పారు. మనకున్నంత స్వేచ్ఛను వారికీ కల్పించాలన్నారు. 1929లో స్వాభిమాన ఉద్యమ తొలి మహాసభలో స్త్రీలకు కూడా పురుషుల్లా ఆస్తి హక్కునూ, వారసత్వపు హక్కును కల్పించాలనీ, స్త్రీలు కూడా ఏ వృత్తినైనా చేపట్టి జీవించగల సమాన హక్కులను కల్పించాలని తీర్మానం చేశారు. నాస్తికత్వమే తాత్విక ఆయుధంగా ఆయన రచనలూ, ప్రసంగాలతో ఉద్యమం కొనసాగింది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి. ఆయన కృషిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి విద్యా, సాంఘిక, సాంస్కృతిక సంస్థ యునెస్కో 1970 జూన్‌ 27న ''నూతన యుగ ప్రవక్త పెరియార్‌'' అంటూ ప్రసంశాపత్రాన్ని అందజేసింది. అజ్ఞానం, మూఢనమ్మకాలు, ఆచార సంప్రదాయాలకు ఆయన బద్ధశత్రువు. నేడు దేశమంతటా లక్షలాదిమంది సామాజిక చైతన్యం, సమానత్వం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. చదువుకున్నవారికి, శాస్త్రజ్ఞానం ఉన్నవారికి నాస్తికత్వం అబ్బుతుందన్న అభిప్రాయం అసత్యమని, సామాన్య ప్రజలకు, నిరక్షరాస్యులకు కూడా నాస్తికత్వం జీవన సిద్ధాంతంగా నేర్పించినవాడు పెరియార్‌.1957 నవంబర్‌ 26న చారిత్రక కులనిర్మూలనా పోరాటం సాగించారు. భారత రాజ్యాంగంలో వర్ణాశ్రమం, కులవ్యవస్థను సమర్థిస్తూ కొన్ని అధికరణలు ఉన్నాయి. ఈ అధికరణలున్న ప్రతులను తంజావూర్‌లో జరిగిన సభలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నవంబర్‌ 26న రాష్ట్రమంతటా పెరియార్‌ ఉద్యమకారులు దగ్ధం చేశారు. 16 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పెరియార్‌తో సహా మూడు వేల మందికి న్యాయస్థానం ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ కఠిన కారాగార శిక్ష విధించింది. కుల నిర్మూలన కోసం జరిగిన మహత్తర పోరాటంలో పాల్గొన్నవారిని శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని రూపొందించి అమలు చేసింది. శిక్షను అనుభవిస్తూ జైల్లో నలుగురు నాస్తికులు మరణించారు. విడుదలైన తరువాత మరో 16 మంది మరణించారు. రాజ్యాంగంలో కులవ్యవస్థను సమర్థిస్తున్న అధికరణలలో 372 ఒకటి. చరిత్రలో కులవ్యవస్థను స్థిరపరుస్తున్న రాజ్యాంగ ప్రతులను అన్ని వేలమంది తగులబెట్టడం అదే మొదటిసారి.
- టి శ్రీరామమూర్తి
(వ్యాసకర్త భారత నాస్తిక సమాజం రాష్ట్ర గౌరవాధ్యక్షులు)
  Advertisement
 
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. పండితుల అప్ గ్ర ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు....
........................................................... విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన
................................................................................................ (ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’) ఖమ్మంలో రై ..
----------------------------------------------------------------------------------------------------
నీట్ ఫలితాలలో ఖమ్మం హార్వెస్ట్ విద్యార్థుల విజయ కేతనం
........................................................................ నీట్ ఫలితాలలో ఇప్పటి వరకు తెలిసిన నలుగురి ఫలితాలలో జాహ్నవి ST ..
----------------------------------------------------------------------------------------------------
సుడా అధ్యక్షునికి అరేబియన్ డైన్ తౌసిప్ (బాబి) శుభాకాంక్షలు
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ సుడా అధ్యక్షులు బచ్చు విజయ్ కుమార్ కు సన్మానం. ఖమ్మం నగరంలోని సుడా కార్య ..
----------------------------------------------------------------------------------------------------
రాలిన ధ్రువతార
............................................................... భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో మువ్వల సవ్వడి ఆగిపోయింది. కూచిపూ ..
----------------------------------------------------------------------------------------------------
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి
............................................................................ హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
----------------------------------------------------------------------------------------------------
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు
....................................................................................... తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
----------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు
.............................................................. హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది. నగరమంతా నీటిమయమ ..
----------------------------------------------------------------------------------------------------
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం
............................................................................................. భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
----------------------------------------------------------------------------------------------------
నాగరాజుది ఆత్మహత్య కాదు..కుటుంబీకుల అనుమానాలు !
................................................................................ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయ ..
----------------------------------------------------------------------------------------------------
CM పదవి నుంచి జగన్ ను తొలగించండి.. సుప్రీంకోర్టులో పిటిషన్
CM పదవి నుంచి జగన్ ను తొలగించండి.. సుప్రీంకోర్టులో పిటిషన్. ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్‌ను ..
----------------------------------------------------------------------------------------------------
స్పర్శ భాస్కర్ మాతృమూర్తి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కాకి సాలమ్మ ఇక లేరు.. khammamtv.com
........................................................................................... (ప్రభాకర్, ఖమ్మం ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’) పోరాటమే ప్రా ..
----------------------------------------------------------------------------------------------------
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం శ్రీ చైతన్య విజయ కేతనం - khammamtv.com
............................................................................................................. (శ్రీదేవి, విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’) ..
----------------------------------------------------------------------------------------------------
బంగారం తాకట్టు పెట్టి మరీ... బాదితులకు అండగా....
..................................................................... డబ్బులుండీ సాయం చేయడం చూశాం.. పేరు కోసమో.. అధికారం కోసమో... హోదా కో ..
----------------------------------------------------------------------------------------------------
లాక్ డౌన్ ను ప్రజలు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.
లాక్ డౌన్ ను ప్రజ లు తప్పకుండా పాటించాలి.-- ఎస్పీ.ఈ రెండు వారాలు చాలా ముఖ్యమైన రోజులు,ప్రజ ..
----------------------------------------------------------------------------------------------------
కరోనా బాదితులకు అండగా BJP సేవలు ప్రశంసనీయం : SP కోటిరెడ్డి
............................................................................................... కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ దేశ ..
----------------------------------------------------------------------------------------------------
15న సన్ రైజ్ సిటీ భూమి పూజా మహోత్సవం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ....................................................................................... ఖమ్మం శివార ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో పుడమి డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం - khammamtv.com
ఉదయ్ భాస్కర్, ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................................... ప్రముఖ రియ ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మం జిల్లా స్వర్ణ వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం.. - khammamtv.com
............................................................................................ బంగారం వ్యాపార రంగంలో మా (మీ) " శ్రీ వెంకట్రామా జ్యూయలర్ ..

చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com
(చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ) ................................................... ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
----------------------------------------------------------------------------------------------------
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి
పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................................. ప్రియాంక రెడ్డీ, మా ..
----------------------------------------------------------------------------------------------------
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీకి బసవ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఎంపిక - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూ ..
----------------------------------------------------------------------------------------------------
బాలల స్నేహ పూరిత వారోత్సవాల ప్రచార పత్రాల ఆవిష్కరణ - khammamtv.com
పాల్వంచ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. నవంబర్ 14 నుంచి 20వ తేది వరకు నిర్వ ..
----------------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : MLA సండ్ర - khammamtv.com
................................................................. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సద్వి ..
----------------------------------------------------------------------------------------------------
బాదితులను పరామర్శించిన మాజీ MLA మదన్ లాల్ - khammamtv.com
కారేపల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ........................................... ఖమ్మం జిల్లా కారేపల్లి కి చెందిన SK బీబ ..
----------------------------------------------------------------------------------------------------
న్యూ ఎరా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం విద్యావిభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .............................................. సంస్కారవంతమైన, నైతిక విలువ ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడలో BJP గాంధీ సంకల్ప యాత్ర - khammamtv.com
............................................................... భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన గాంథీ సంకల్ప య ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోట లో కార్డెన్ తనిఖీ.. రూ.7 లక్షల అక్రమ సామాగ్రి స్వాధీనం - khammamtv.com
బోడ కిషన్, మానుకోట రిపోర్టర్, ఖమ్మం టీవీ. .............................................................. మహబూబాబాద్ పట్టణంలో పోల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................... ఖమ్మం నగరం శ్ ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ......................................................................................... ఖమ్మం నగరంల ..
----------------------------------------------------------------------------------------------------
24న బ్రింద మల్టీ స్పెషాలిటీ, ఎమర్జన్సీ, క్రిటికల్ కేర్ హాస్సిటల్ ప్రారంభం - khammamtv.com
ఖమ్మం వైద్య విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................................. ఖమ్మం నగరంలోని శ్రీర ..
----------------------------------------------------------------------------------------------------
RTC తాత్కాలిక ఉద్యోగుల విధులకు ఆటంకపరిస్తే కేసులు నమోదు : CP
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .................................................................................. TSRTC సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ..
----------------------------------------------------------------------------------------------------
జర్నలిస్టు హత్య పిరికిపంద చర్య-TUWJ(IJU) రాంనారాయణ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ---------------------------------------- తూర్పు గోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి గ ..
----------------------------------------------------------------------------------------------------
అమరవీరుల సంస్మరణలో ప్రజా భాగస్వామ్యం: CP తప్సీర్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------- అక్టోబర్ 15వ తేది నుండి 21 వరకు ఖమ్మం ..
----------------------------------------------------------------------------------------------------
RTC డ్రైవర్ DS రెడ్డి బలిదానానికి నిరసనగా ఆందోళన - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ----------------------------------------------------------------------------- సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మ ..
----------------------------------------------------------------------------------------------------
అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------ TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
సమ్మె పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ - khammamtv.com
హైదరాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ .......................................................................... RTC ని ప్రైవేటీకరిస్తామని ప ..
----------------------------------------------------------------------------------------------------
15 లోపు టపాసు దుకాణదారులు అనుమతి తీసుకోవాలి : ACP - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ................................................... ఖమ్మం నగరంలో టపాసుల దుకాణాలు పెట్టుకో ..
----------------------------------------------------------------------------------------------------
ప్రాణం వాసన రమాదేవి బాలబోయిన కవితా సంపుటి - khammamtv.com
.................................................................................................... కొన్ని భావాలనూ, అనుభవాలను స్త్రీ స్వయంగా వ్యక్తపరు ..
----------------------------------------------------------------------------------------------------
మరిపెడ దేవీ నవరాత్రుల్లో అన్నదానం - khammamtv.com
................................................................... దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ ..
----------------------------------------------------------------------------------------------------
జిల్లా గ్రంథాలయ సంస్థలో బాపూజీ జయంతి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ --------------------------------------------------------------------------------- మహాత్మాగాంధీ 150వ జయంతిని పుర ..
----------------------------------------------------------------------------------------------------
మానుకోటలో KVPS ఆవిర్భావ దినోత్సవం - khammamtv.com
బోడ కిషన్ నాయక్, మహబూబాబాద్ రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ............................................................................ మహబూబాబ ..
----------------------------------------------------------------------------------------------------
బజ్జీల బండి తల్లి బిడ్డ.. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ -------------------------------------------------- ప్రతిభకు నేపథ్యం అక్కర లేదు... కాస్త ప్ర ..
----------------------------------------------------------------------------------------------------
DPRO శ్రీనివాస్ కు TUWJ IJU నివాళి - khammamtv.com
ఖమ్మం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------ రహదారి ప్రమాదంలో అకాల మరణం పొందిన జిల ..
----------------------------------------------------------------------------------------------------
ఖమ్మంలో బుడిగె బావి పుస్తకావిష్కరణ - khammamtv.com
............................................................... ప్రముఖ రచయిత రాజారాం రచించిన ‘బుడిగె బావి’ పుస్తకావిష్కరణ సభ ఖమ ..
----------------------------------------------------------------------------------------------------
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com
................................................................ 'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
----------------------------------------------------------------------------------------------------
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com
.......................................................................... భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
----------------------------------------------------------------------------------------------------
దొంగలనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - khammamtv.com
............................ కామేపల్లి రిపోర్ట్, ‘ఖమ్మం టీవీ’ ------------------------------------------------------------ దొంగతనాలు చేశారనే అన ..
----------------------------------------------------------------------------------------------------
More..