అన్నా.. అని పిలవడమే RTC కార్మికుల సంప్రదాయం - khammamtv.com
------------------------------------------------------------------------------
TSRTC కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ, ప్రభుత్వ ప్రకటన వినీ, సమ్మె చేస్తున్న RTC కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టే అనే ప్రకటనను విని మనోవేదన చెంది, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దేవిరెడ్డి శ్రీనివాస(DS) రెడ్డి హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆయన మరణం పట్ల ఖమ్మం డిపో RTC కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం RTC కార్మికుల సమ్మె పట్ల నిర్బంధంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి పాల్పడడం బాధాకరం.
RTC ఖమ్మం డిపోలో బూదాటి శ్రీనివాసరెడ్డి, దివంగత దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురు బావ బామ్మర్దులు. ఆ నేపథ్యంలో బూదాటి శ్రీనివాసరెడ్డిని అన్నా అంటూ, దివంగత దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బావా అంటూ ఖమ్మం డిపో కార్మికులు ఆప్యాయంగా పిలుచుకునే వారు. అందరి కార్మికులతో అనుబంధం కలిగి, ఆప్యాయంగా మాట్లాడే శ్రీనివాసరెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఖమ్మం డిపో కార్మికులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని నెమరు వేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఖమ్మం డిపోలో క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ గా, తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరెడ్డి అతి తక్కువ వేతనాలు గల RTC లో తన కుటుంబ పోషణ కోసం డబుల్ డ్యూటీలూ, ఓవర్ టైం డ్యూటీలు సైతం చేసేవారు. కష్టపడే మనస్తత్వం కలిగిన శ్రీనివాసరెడ్డి అనేక కష్టాలు అనుభవించి, ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నారు.
శ్రీనివాస్ రెడ్డికి భార్య సావిత్రి, పెద్ద కుమారుడైన సాయి అభిరామ్ రెడ్డి ఆర్మీలోనూ, చిన్న కుమారుడు సాయి కార్తీక్ రెడ్డి ఇ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు.
మూడు రోజుల క్రితమే శుక్రవారం పెద్ద కుమారుడైన సాయి అభిరాం రెడ్డి, కోడలు మేఘనా రెడ్డి దంపతుల కుమారుడు(మనవడు)కి బారసాల నిర్వహించారు.
శ్రీనివాసరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే ఖమ్మం డిపో వద్దకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి ఆయన మరణం పట్ల శ్రద్ధాంజలి, మౌనం పాటించారు.
నిన్న మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ హాస్పిటల్ కి తీసుకువెళ్లినా, శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన చెందిన RTC కార్మికులు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో బస్సులు బంద్ చేయించారు. RTC కార్మికుల సమ్మె నేపథ్యంలో మనోవేదనతో శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్కా, తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నాయకులు మెచ్చ నాగేశ్వరరావూ, CPI (ML - న్యూడెమోక్రసీ) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావూ, CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావూ, CPI జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావూ, CPI (ML - న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వరావూ, న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావూ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరావూ, CPM జిల్లా నాయకులు ఎర్రా శ్రీకాంత్, తెలుగుదేశం జిల్లా నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లూ, CPI జిల్లా నాయకులు సింగు నరసింహారావూ, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం, BJP నగర అధ్యక్షులు రుద్ర ప్రదీప్, IFTU జాతీయ నాయకులు ముక్తార్ పాషా, CITU జిల్లా అధ్యక్షులు K.నరసింహారావూ, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి BG.క్లెమెంట్, IFTU జిల్లా కార్యదర్శి G.రామయ్యా, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావూ, ప్రజా సంఘాల నాయకులు ఆవుల అశోక్, TPTF నాయకులు మనోహర్ రాజు, TSUTF నాయకులు నెల్లూరు వీరబాబూ, కాంగ్రెస్ నాయకులు V.హనుమంతరావు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు సోమయ్యా, PRTU నాయకులు మధూ, అయినాల లక్ష్మీ నారాయణా, కట్టా శేఖర్, రెబ్బ శ్రీనూ, BC సంఘం నాయకులు పిండిప్రోలు రామ్మూర్తీ, తుమ్మ విష్ణు వర్ధన్, ఎర్రా శ్రీనివాసరావు, విక్రం, CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావూ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి రమేష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బండి పద్మా, వాసిరెడ్డి భాస్కరరావూ, మందా వెంకటేశ్వర్లూ, సీతా మహాలక్ష్మీ, గాదె లక్ష్మీనారాయణా, విద్యార్థి సంఘ నాయకులు రామకృష్ణా, శ్రావణ్, మాదినేని రమేష్, మీరా, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేముల సదానందం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చింతల రమేష్, అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Latest News
ప్రియాంక, మానస కు కొవ్వొత్తులతో నివాళి పెనుబల్లి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
ప్రియాంక రెడ్డీ, మా ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..
చేపల చెరువు లూటీపై ముదిరాజుల ఆందోళన - khammamtv.com .........................................................................................................
కురవి రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
--------------------------------------------------
..