స్పర్శ భాస్కర్ మాతృమూర్తి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కాకి సాలమ్మ ఇక లేరు.. khammamtv.com
...........................................................................................
(ప్రభాకర్, ఖమ్మం ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
పోరాటమే ప్రాణంగా జీవించిన అమరజీవి కాకి లక్ష్మారెడ్డి జీవిత సహచరిణి, ఖమ్మం స్పర్శ హాస్పిటల్ అధినేత కాకి (స్పర్శ) భాస్కర్ మాతృమూర్తి కాకి సాలమ్మ (84) రాత్రి ఒంటిగంటకు ఖమ్మం లో అమరులయ్యారు.. 24 జులై 2020న మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా అమర్ నగర్ లో అంతిమ సంస్కార కార్యక్రమం ఉంటుంది..
సాలమ్మ తన భర్త లక్ష్మారెడ్డి మరణం తర్వాత కృంగి పోయారు.
కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
స్థానిక స్పర్శ వైద్యశాలలో ఈ మేరకు చికిత్స కూడా తీసుకుంటున్నారు.
అయినా పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు.
సాలమ్మ మరణ వార్త తెలుసుకున్న పలువురు వామ పక్ష, ప్రజా సంఘాల నాయకులూ, వైద్యులూ, న్యాయవాదులూ, పాత్రికేయులు, ప్రగతిశీల, ప్రజాతంత్ర ఉద్యమ కారులూ, సామాజిక ఉద్యమ కార్యకర్తలు సాలమ్మ భౌతికాయాన్ని స్పర్శ హాస్పిటల్ లో సందర్శించారు.
సాలమ్మ మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకూ, ఉద్యమకారులకు తీరని లోటని వారు పేర్కొన్నారు.
స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ, తెలంగాణా సాయుధ పోరాట సమయంలో సాలమ్మ కీలక పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు.
కమ్యూనిస్టూ, ప్రజా సంఘాల కార్యకర్తలకు ఆమె చేదోడు వాదోడుగా ఉండేవారని వారు వివరించారు.
సాలమ్మ జీవితం ఆదర్శనీయమని వారు కొనియాడారు.
ఆమె ఆశయ సాధనకు పాటు పడాలని వారు కోరారు.
పలువురి సంతాపం.....
సాలమ్మ మృతి తనను కలిచి వేసిందని ప్రముఖ న్యాయవాదీ, సామాజిక ఉద్యమకారులు మేకల సుగుణారావు పేర్కొన్నారు.
యువజనులు సాలమ్మ జీవితం స్పూర్తిదాయకమని ఆయన అన్నారు.
సాలమ్మకు ఘనంగా జోహార్లు, నివాళి అర్పించారు.
కాకి లక్ష్మారెడ్డి గారి కుటుంబ ఉద్యమ జ్ఞాపకాలు కొన్ని..పోరాటమే ప్రాణంగా ఉద్యమమే జీవితంగా పోరాడి గెలిచిన ఉద్యమ కుటుంబం నేటి తరానికి ఆదర్శం..వారి వారసత్వంలో పెరిగిన పిల్లలు నేటి సామాజిక మార్పుకోసం నిలబడటం అంటే వారివారసత్వాన్ని కొనసాగించడమే.మంచి సామాజిక స్ఫూర్తి తో కొనసాగుతూ నిజ జీవితంలో కూడా వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న కాకి భాస్కర్ ని ఈ రోజు మనం చూస్తున్నాం..అందుకే కుటుంబ బంధనాలు తెంచుకుని ప్రజాక్షేత్రంలో నిలబడ్డ వీరి కుటుంబం సదా అనుసరణీయం..జోహార్ కామ్రేడ్ కాకిసాలమ్మ.
స్పర్శ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనుమోలు అప్పారావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
CPI ... సాలమ్మ మృతి పట్ల CPI రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శీ, స్థానిక కార్పోరేటర్ BG.క్లెమెంట్ సంతాపాన్ని ప్రకటించారు.
CPI (M)..... రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సంతాపాన్ని ప్రకటించారు.
CPI (ML-ND)... రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు జోహార్లు అర్పించారు.
‘ఖమ్మం టీవీ’.... ప్రధాన సంపాదకులు శ్రీనివాస్ మారబోయిన, జిల్లా ప్రతినిధి ప్రభాకర్ సాలమ్మ భౌతికాయాన్ని సందర్శించి జోహర్లు అర్పించారు.
స్పర్శ భాస్కర్....
24.7.20న రాత్రి 1గం:లకు మా అమ్మ (సాలమ్మ) చనిపోయింది. 84 ఏళ్ళ వయస్సు. తన జీవితమంతా కష్టాలతోనే గడిచింది.
మా నాన్న విప్లవ రాజకీయ జీవితంలో తనెప్పుడూ పరోక్ష భాగస్వామిగా కష్టాలు పడుతూనే నడిచింది. మా నాన్న అజ్ఞాత జీవితం గడిపితే తను మమ్మల్ని సాదుకుంది.
మానాన్న జైలు కెళ్తే తను ఇంట్లో బందీ అయి మమ్మల్ని కాపాడుకుంది.
ఆస్తులన్నీ తరిగిపోతే పేదరికాన్ని అనుభవించింది. మాయింటి కొచ్చే వందలాదిమంది ప్రజా కార్యకర్తలకు అమ్మ అయి అన్నం పెట్టింది.
మానాన్నతో పాటు ఉద్యమ అవసరాల్లో ఎన్నో బదిలీలను, మజిలీలను సంతోషంగా స్వీకరించింది. ఈ కష్టాలతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తననే వెంటాడాయి.
ఆస్తమా నుండి మొదలు కాన్సర్ వరకు అనీ తనని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ చివరి వరకు వెంటాడుతూనే ఉన్నవి.
అందరూ తిన్నంక మిగిలిన మాడు చెక్కలతోనే కడుపు నింపుకున్న ఘటనలు ఎన్నో... అన్నిటినీ చిరునవ్వుతోనే స్వీకరించిన మా అమ్మ ఇక లేదు... మమ్మల్ని కన్న అమ్మ మా కలల్ని కూడా పంచుకుంది. అమ్మలు మనల్ని కంటారు కానీ మనం అమ్మలను కనలేం కదా... అందుకే అమ్మని సాధ్యమైనంత కాలం సాదుకునే ప్రయత్నం చేసాం.
కానీ ఇక వాయిదా వేయలేకపోయాము...
అమ్మకు కన్నీటి వీడ్కోలు...జొహార్లు
Advertisement
Latest News
RUPP TS కాల మానిని ఆవిష్కరణ విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
.............................................................................................
పండితుల అప్ గ్ర ..
ఖమ్మం రెజోనెన్స్ దాస్ ఇక లేరు.... ...........................................................
విద్యా విభాగం రిపోర్టర్, ‘ఖమ్మం టీవీ’
ఖమ్మం రెజోనెన్స్ కళాశాలలో స ..
ఖమ్మం రైతుబజారు ను తెరవాలంటూ BJP ఆందోళన ................................................................................................
(ప్రభాకర్, జిల్లా ప్రతినిధి, ‘ఖమ్మం టీవీ’)
ఖమ్మంలో రై ..
రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్లండి ............................................................................
హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జ ..
వర్షాల కారణంగా ఇవాళా, రేపు సెలవులు .......................................................................................
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్త ..
హైదరాబాద్ కు పొంచి వున్న మరో ముప్పు ..............................................................
హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.
నగరమంతా నీటిమయమ ..
వర్షాలూ, వరదలకు హైదరాబాద్ లో 15 మంది దుర్మరణం .............................................................................................
భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ..
చింతకాని SI రెడ్డబోయిన ఉమ - khammamtv.com (చింతకాని రిపోర్టర్ - ఖమ్మం టీవీ)
...................................................
ఖమ్మం జిల్లా చింతకాని SI గా రెడ్డబోయిన ..
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం - khammamtv.com ................................................................
'చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిలా బతకాలి...' అందరూ చిరునవ్వులతో ఉం ..
సామాజిక విప్లవకారుడు పెరియార్ - khammamtv.com ..........................................................................
భారతదేశంలో పీడిత కుల ప్రజలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతల ..