#khammamtv #KhammamNews
Watch to కమనీయం.. రాములోరి కల్యాణం
ఖమ్మం వీడీవోల కాలనీ, బ్యాంకు కాలనీ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ సీతారామాంజనేయ
స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు భక్తుల ఆనందోత్సహాల నడుమ ముగిసాయి.
ఈ మేరకు స్వామి వారినీ, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
వేడుకల్లో బాగంగా ఆలయ అర్చకులు కొడగండ్ల నవీన్ ఆధ్వర్యంలో మూడో రోజు రాత్రి సీతారామ తిరు
కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.
కల్యాణానికి ముందు జీలకర్ర బెల్లం, కన్యాదానం, ఎదుర్కోలు ఉత్సవం, మాలల మార్పిడి కన్నుల పండువలా
నిర్వహించారు.
అనంతరం తీర్థ, అన్న ప్రసాద వినియోగం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన ముగింపు సభకు ఖమ్మం నగర ACP ఆంజనేయులు దంపతులూ, TGO రాష్ట్ర
కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావూ, రెండో పట్టణ CI గోపీ, SI భవానీ తదితరులు పాల్గొన్నారు.
దేవాలయలంలో వివిధ పారాయణాలను ఉద్యమంలా నిర్వహిస్తున్న ప్రముఖ అధ్యాత్మికవాది రమణ ను
నిర్వాహాకులు ఘనంగా సత్కరించారు.
ఈ నేపథ్యంలోనే అతిథులనూ నిర్వాహాకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ACP మాట్లాడారు.
మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమన్నారు.
కార్యక్రమాలను భక్త మండలి సభ్యులు చెరుకూరి రమేష్ బాబు, ఏపూరి మధుసూదన్ రావూ, గుంటుపల్లి
శ్రీనివాస్, భావనాద్రి కేశవరావూ, మన్నేపల్లి వెంకటేశ్వర్రావూ, రమణా, పుసులూరి రోజా, జయశ్రీ, భారతీ,
నిర్మలా, పారిజాతం, సునీతా, వరలక్ష్మీ, లక్ష్మీ, శివపార్వతీ, సురేఖా, అనితా, సులోచన తదితరులు
పర్యవేక్షించారు. |